Kapali's Blog

ఘొష

Posted in సవ్వడి by vishwakapali on July 20, 2009

ఏమని చెప్పను? ఎలా చెప్పను?

మాటలకందని ఆవెదన!

దిక్కులు పిక్కటిల్లేలా అరవాలని
ఇనుప సంకెల్లను కసిగా తెంచాలని

ఈ రక్తమాంసదేహం నుంచి విమూక్తి పొందాలని
ఏదో సాధించాలని.. మదిలో అలజడి

ఏమని చెప్పను? ఎలా చెప్పను? ..ఎవరో చెప్పారు ..
మదిలోని భావాలని వ్యక్తపరచలేని అసహాయతను
మించిన పేదరికము మరొకటి లేదని..

నేనోక నిశభ్ధ ప్రేక్షకుడిని..

- కపాలి (28/11/2006)

అసమర్థుని జీవ యాత్ర ..

Posted in సవ్వడి by vishwakapali on July 20, 2009

Everyone, at some point in their lives can relate to the lead character portrayed in Tripuraneni Gopichand’s classic ‘Asamarthuni Jeeva Yatra’. I have few lines that go this way..

వైఫల్యాన్ని ఒప్పు కోని అహం

విధి పాత్రను తిరస్కరిస్తున్న తర్కం

తానొవ్వక మరొకరినొప్పించని సున్నితత్వం

ప్రతి ఆలోచనను అప్రమత్తంగా విష్లేశిస్తున్న భయం

ఈ ఆలోచనాసరళికి ఏది మూలమని ప్రశ్నిస్తున్న అంతరంగం

ప్రతి ప్రశ్నకూ దొరుకుతుంది ఉత్తరువు

ఏ జవాబునూ అంగీకరించనివాడే అసమర్థుడు


- కపాలి (22/12/2008)